ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి

5 Nov, 2020 14:29 IST|Sakshi

మోడల్‌‌, నటి గౌహర్‌ ఖాన్‌ ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి ఈ భామ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. సోషల్‌ మీడియా స్టార్‌ జైద్‌ దర్బార్‌తో రిలేషన్‌షిప్‌లోఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక దర్బార్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనికి ఉంగరం, హార్ట్‌ సింబల్‌ను జత చేశారు. ఇదే ఫోటోను జైద్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో బెలూన్లతో ఏర్పాటు చేసిన లొకేషన్‌లో గౌహర్‌, జైద్‌ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. దీంతో పెళ్లి పీటలెక్కనన్న గౌహర్‌ ఖాన్‌, జైద్‌ దర్బార్‌ జంటకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గల నెలలో పెళ్లి చేసుకున్న నేహా కక్కర్‌ స్పందిస్తూ తమను ఇలా చూడటం ఆనందంగా ఉందని, ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రెండో వివాహం

కాగా వీరు డిసెంబర్ 25న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. వివాహ వేడుకలు డిసెంబర్ 22 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కోవిడ్‌ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వనించానున్నారు. ఇదిలా ఉండగా గౌహర్‌ ఖాన్‌ హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొని విజేతగా నిలిచారు. ప్రస్తుతం గౌహర్ ఖాన్‌కు 37 సంవత్సరాలు కాగా జైద్ దర్బార్‌కు 29. వీరిద్దరికి వయసులో ఎనిమిది సంవత్సరాల తేడా ఉంది. కానీ జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదని ఈ జంట పేర్కొన్నారు. చదవండి: ‘నాగిని’ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా?

💍♥️ @zaid_darbar

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు