‘నా కొడుకు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దది’

22 Oct, 2020 16:11 IST|Sakshi

ముంబై: తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు బాలీవుడ్‌ నటి గౌహర్‌ ఖాన్‌. ఏదైనా విశేషం ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని, వదంతులు నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా బాలీవుడ్‌ కంపోజర్‌ ఇస్మాయిల్‌ దర్బార్‌ కుమారుడు, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను గౌహర్‌ వివాహమాడనున్నారంటూ గత కొన్నిరోజులుగా బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబరులో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల సోషల్‌ మీడియాలో వీరిద్దరు పోస్ట్‌ చేసిన ఓ డాన్సింగ్‌ వీడియోలు, ఫొటోల ఆధారంగా గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.(చదవండి: ‘నాతో మాట్లాడటానికే భయపడింది.. కానీ’) 

ఇక ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న గౌహర్‌ ఖాన్‌, అక్కడికి వెళ్లడానికి ముందు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ జైద్‌తో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి జైద్‌ తండ్రి ఇస్మాయిల్‌ దర్బార్‌ తాజాగా స్పందించారు. జైద్‌, గౌహర్‌ ప్రేమలో ఉన్నారని, అయితే వారు ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న విషయం గురించి తమకు తెలియదన్నాడు. ‘‘గౌహర్‌ అంటే తనకు అభిమానమని, ఆమె కూడా తనంటే ఇష్టపడుతుందని జైద్‌ నాకు చెప్పాడు. వారి బంధం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజానికి గౌహర్‌ అంటే నాకూ, నా భర్య అయేషాకు ఎంతో ఇష్టం. (చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు

అయితే గౌహర్‌, జైద్‌ కంటే సుమారు ఐదేళ్లు పెద్దది. అంతకంటే ఎక్కువే కావొచ్చు కూడా. ఓ తండ్రిగా ఈ విషయం గురించి నా కొడుకు వద్ద ప్రస్తావించాను. నీది నిజమైన ప్రేమ అయితే వయసు అడ్డంకి కాదని, అయితే పెళ్లి చేసుకోవడానికి ముందే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. జైద్‌ ఇలాంటి పట్టించుకోనని చెప్పాడు. తనకు ఎలాంటి పట్టింపు లేదని చెప్పాడు. అప్పటి నుంచి గౌహర్‌ మాతో మరింత ఆప్యాయంగా మెలుగుతోంది. వాళ్ల జంట బాగుంటుంది. గౌహర్‌ నా కుమారుడి పట్ల చూపించే అనురాగం, ఆప్యాయతలు తను చూపే శ్రద్ధ మమ్మల్ని కట్టిపడేశాయి’’అని చెప్పుకొచ్చాడు.(వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు