చాక్లెట్స్‌ ఇచ్చి కాజల్‌ను కూల్‌ చేసిన గౌతమ్..‌‌

25 Mar, 2021 18:10 IST|Sakshi

సెలబ్రిటీ కపుల్స్‌లో కాజల్‌ అగర్వాల్‌​-గౌతమ్‌ కిచ్లు జంట ఒకటి. వీరిద్దరి పెళ్లి విషయం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి తరుచూ వార్తలో నిలుస్తున్నారు. గతేడాది ఆక్టోబర్‌ 30న పెళ్లి పీటలెక్కిన ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే పెళ్లి అనంతరం కాజల్‌ సినిమాలతో, గౌతమ్‌ తన బిజినెస్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరితో ఒకరు ప్రేమగా సమయం గడిపేందుకు కుదరడం లేదు. ఈ క్రమంలో తన భర్త గురించి చెబుతూ కాజల్‌ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు. గౌతమ్‌ ఇచ్చిన అయిదు డిఫరెంట్‌ ఫ్లేవర్‌ చాక్లెట్లను ముఖానికి అడ్డంగా పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే కాజల్‌కు ఇష్టమని చాక్లెట్‌లు ఇవ్వలేదు. దీని వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందడోయ్‌.

పెళ్లి తర్వాత గౌతమ్‌ తన వృత్తిపరమైన పనుల్లో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో తనుకున్న వర్క్స్‌‌ కారణంగా చందమామతో సమయం గడిపేందుకు సరిగా వీలు దొరకడం లేదు. అందుకే ఇంటికి తిరిగొచ్చినప్పుడు తనకు ఇష్టమైన చాక్లెట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను కూల్‌ చేశాడు. ఈ విషయాన్ని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొన్నారు. గౌతమ్ బహుమతిగా ఇచ్చిన చాక్లెట్ల ఫోటోను షేర​ చేస్తూ.."నా భర్త నాతో ఎక్కువ సమయం వెచ్చించలేకపోవడంతో దానికి బదులు ఇలా వీటిని తీసుకొచ్చాడు. నా డైట్‌ కూడా నాశనం చేస్తుంది. ఏది ముందు తినేశానని మీరు అనుకుంటున్నారు. అనే క్యాప్షన్‌ జతచేశారు.

చదవండి: ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్‌
వైరలవుతున్న రామ్‌చరణ్‌- ఉపాసన రొమాంటిక్‌ ఫోటో

మరిన్ని వార్తలు