Gautham Karthik-Manjima Mohan Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్‌!

14 Nov, 2022 09:46 IST|Sakshi

‘కడల్‌’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్‌ కార్తీక్‌, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్‌ మంజిమా మోహన్‌ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాము రిలేషన్‌లో ఉన్నామంటూ ఇటీవల ఈ జంట అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఈ జంట సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు పెళ్లెప్పుడు అంటూ వారి పోస్ట్స్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు.

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు!

ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఈ జంట పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకొబోతున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి అనంతరం భారీగా విందును ఇవ్వనున్నట్టు సమాచారం. పస్నేహితులు, సన్నిహితుల కోసం ఊటీ, చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు జరుగుతున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమా హీరోహీరోయిన్లుగా నటించారు.

చదవండి: నా గ్లామర్‌ ఫొటోలు చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు: హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో తమిళ మీడియాలో కథనాలువ చ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్‌ 31న కార్తీక్‌తో ప్రేమలో మంజిమా వెల్లడించగా.. నవంబర్‌ 5న తామిద్దరి ఫొటోలను షేర్‌ చేసి ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశాడు గౌతమ్‌ కార్తీక్‌. కాగా గౌతమ్‌ కార్తీక్‌ సీనియర్‌ నటుడు కార్తీక్‌ తనయడు అనే విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు