Gautham Menon: షాకింగ్‌గా ఉంది, నాకే తెలియ‌కుండా ఇదెలా సాధ్యం?

5 Nov, 2021 11:14 IST|Sakshi

త‌మిళ చిత్రం 'అంబు సెల్వ‌న్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇటీవ‌లే రిలీజైంది. 'ద కాప్ డెవిల్' అనేది ఉప‌శీర్షిక‌. వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ న‌టుడు విష్ణు, ద‌ర్శ‌కుడు పా రంజిత్ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ పోలీస్ అధికారిగా క‌నిపిస్తున్నాడు. అయితే తాను ఈ సినిమాలో ఎప్పుడు న‌టించాన‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నాడు గౌత‌మ్‌.

'ఇది షాకింగ్ న్యూస్‌. ఈ సినిమా గురించి నాకేం తెలీదు. పోస్ట‌ర్‌లో ఉన్న ద‌ర్శ‌కుడిని నేనెప్పుడూ క‌ల‌వ‌లేదు, అత‌డెవ‌రో కూడా తెలియ‌దు. పెద్ద‌పెద్ద‌వాళ్ల‌తో నిర్మాత‌లు ఈ పోస్ట‌ర్‌ను ట్వీట్ చేయిస్తున్నారు. నాకే తెలియ‌కుండా నేను సినిమా చేస్తున్న‌ట్లు అభూత క‌ల్ప‌న చేయ‌డం నిజంగా షాకింగ్‌గా, భ‌యంక‌రంగా ఉంది' అని ట్విట‌ర్‌లో రాసుకొచ్చాడు. అయితే అత‌డి వ్యాఖ్య‌ల‌ను నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ కొట్టిపారేసింది. అత‌డు కూడా సినిమాలో భాగ‌మేన‌ని చెప్తూ రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్ ఛాన‌ల్‌లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో గౌత‌మ్ న‌టుడు వివేక్ ప్ర‌స‌న్న‌తో క‌లిసి న‌టించిన‌ట్లుగా ఉంది. మ‌రి దీనిపై గౌత‌మ్ మీన‌న్ ఏమని స్పందిస్తాడో చూడాలి!.

మరిన్ని వార్తలు