‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ నుంచి ‘కాంతార’ తరహాలో మరో చిత్రం!

11 Nov, 2022 14:20 IST|Sakshi

టాలీవుడ్‌ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్‌ ఒకరు. సినిమాల విషయంలో ఈయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. డబ్బింగ్‌ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసి భారీ కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డు సృష్టిస్తున్నాడు. కన్నడలో సూపర్‌ హిట్ అయిన ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్‌ 15న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేసి హిట్‌ కొట్టాడు. ఈ సినిమా కలెక్షన్స్‌ చూసి టాలీవుడ్‌ ఆశ్చర్యపోయింది.

 విడుదలైన  2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు  సాధించి దాదాపుగా ఇప్పుడు 60 కోట్ల వసూళ్లను సాధించింది.ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. కానీ అల్లు అరవింద్‌ కంటెంట్‌ని నమ్మి ధైర్యంగా సినిమాను రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు కాంతార తరహాలోనే ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ నుంచి మరో డబ్బింగ్‌ చిత్రం రాబోతుంది.  వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న ‘భేదియా’ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. మరోవైపు  ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే  వరుణ్ ధావన్, కృతిసనన్ కూడా నేరుగా హైదరాబాద్ విచ్చేసి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నారు. కాంతారతో సూపర్ సక్సెస్ అందుకున్న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ఇప్పుడు తోడేలు చిత్రంతో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించుకుంటుంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు