ప్రతీకార జ్వాలతో..

24 Sep, 2023 06:02 IST|Sakshi
సత్యనారాయణ, అంజలి, కోన వెంకట్, శివ

అంజలి టైటిల్‌ రోల్‌లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది.

తొలి సీన్‌కి రామచంద్ర క్లాప్‌ ఇవ్వగా, స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్‌ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్‌ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.

మరిన్ని వార్తలు