తేజ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమవుతున్నా

25 May, 2023 04:49 IST|Sakshi

– గీతికా తివారి

‘‘ఫలానా జానర్‌కు పరిమితం కాకుండా ఓ నటిగా డిఫరెంట్‌ సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు హీరోయిన్‌ గీతికా తివారి. దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. ఈ చిత్రంలో గీతికా తివారి హీరోయిన్‌గా నటించారు. తేజ దర్శకత్వంలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో గీతికా తివారి మాట్లాడుతూ– ‘‘మాది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక యాక్టర్‌గా కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌ చేశాను.

ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నాను. తేజగారితో సినిమాలు చేసిన చాలామంది కొత్త నటీనటులు ఇండస్ట్రీలో సక్సెస్‌ అయ్యారు. ఇలా కొత్తవారిని పరిచయం చేయడంలో తేజగారిది లక్కీ హ్యాండ్‌. ఆయన సినిమా ద్వారా ఇప్పుడు నేను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ‘అహింస’లో చేసిన అహల్య పాత్ర నాకు పెద్ద సవాల్‌ అనిపించింది. కొన్ని సన్నివేశాలకు ఎక్కువ టేక్స్‌ తీసుకున్నాను. కానీ సింగిల్‌ టేక్‌లో పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు