బిగ్‌బాస్‌పై గీతురాయల్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌..

30 Dec, 2022 11:26 IST|Sakshi

చిత్తూరు రూరల్‌: ‘హాయ్‌..చిత్తూరు. నాయనా..మీ అభిమానం సల్లంగుండా!’ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ గీతురాయల్‌ పలకరించింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైనా గీతు రాయల్‌ చిత్తూరు వాసుల్లో జోష్‌ను పెంచింది.

గీతూ.. ఒక్క సెల్ఫీ– అంటూ యువత ఉత్సాహం చూపింది. ఆతర్వాత వేదికపైకి వెళ్లి  హాయ్‌ చిత్తూరు అంటూ మొదలుపెట్టింది. ‘మీ అభిమానం చూస్తుంటే.. నా వల్ల కావడం లేదురా నాయనా.. నేను చిత్తూరు వదిలి వెళ్లి పోయి 15 ఏళ్లు అయింది. అయినా కూడా చిత్తూరు యాసను నా బ్లడ్‌లో ఎక్కించేసుకున్నా. ఏ సందర్భమైనా నేను చిత్తూరు యాసలోనే మాట్లాడుతున్నా.

నన్ను ఏవరైనా మీది ఏ ఊరంటే..హేయ్‌.. మాది చిత్తూరు రా.. అని గర్వంగా చెబుతున్నా. బిగ్‌బాస్‌ వెళ్లాక నేను రెండు విషయాలు నేర్చుకున్నా. మనం తప్పు చేయకపోతే ఎదుటి వ్యక్తి ఎంతా తోపైనా అసలు తగ్గకూడదు. మనవైపు తప్పుంటే చిన్నపిల్లలైనా క్షమాపణ చెప్పాల్సిందే.. జీవితాంతం మీకు రుణపడి ఉంటా’ అని ముగించింది. ఆమెను తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
చదవండి: కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు