నటి గెహనా వశిష్ట్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

12 Aug, 2021 18:16 IST|Sakshi

సాక్షి, ముంబై : రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో నిందితురాలిగా ఉన్న నటి వందనా తివారీ అలియాస్‌ గెహనా వశిష్ట్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ముంబై సెషన్స్‌ కోర్టు గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. తాను గతంలో ఇలాంటి కేసులో అరెస్ట్‌ అయ్యాయని, తనకు సంబంధించిన లాప్‌ట్యాప్‌, ఫోన్‌లను క్రైమ్‌ బ్రాంచ్‌ సీజ్‌ చేసిందని గెహనా కోర్టుకు తెలిపింది. గతంలో ఆమె ఇలాంటి కేసులోనే అరెస్ట్‌ అవ్వటం కారణంగా ప్రస్తుతం పోలీస్‌ కస్టడీ అవసరం లేదని గెహనా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే, వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గెహనా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో ఆమెను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయ్యారు. రెండవ సారి రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆమెపై కేసు నమోదైంది. జులై 19న రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు