షెర్లిన్‌ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు

28 Sep, 2021 11:00 IST|Sakshi

నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో సంబంధాలు కలిగి ఉన్నారని నటి గెహనా వశిష్ట్‌ అరెస్టు అయ్యింది. 133 రోజులు కస్డడీలో ఉన్న అనంతరం ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా దంపతులకు సపోర్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది గెహనా.

మీడియా దృష్టిని ఆకర్షించి, నిత్యం వార్తల్లో నిలిచేందుకే షెర్లిన్‌ చోప్రా,  శిల్పా శెట్టి దంపతుల పరువు భంగం కలిగేలా మాట్లాడుతుందని ఓ ఇంటర్వ్యూలో గెహనా విమర్శించింది. అసలు బిజినెస్‌మెన్‌ రాజ్‌కుంద్రాను నీలి చిత్రాల తీసేలా పురికొల్పింది షెర్లినే అని నటి ఆరోపించింది. కుంద్రా జైలు నుంచి వచ్చాక ఆమెను అందరూ మర్చిపోయారని గుర్తించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడింది.

గెహనా ఇంకా మాట్లాడుతూ.. ‘ షెర్లిన్ చోప్రా కోట్లాది రూపాయలు ఆర్జించేందుకు రాజ్ కుంద్రా ఎంతో సాయపడ్డాడు. ఆయన క్రియేట్‌ చేసిన ఆర్మ్‌స్ప్రైమ్ యాప్ ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. ఆమె వల్లే ఆయన ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. నిజానికి 2012 నుంచే షెర్లిన్‌ బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలు చేస్తోంది. వారిద్దరూ పరిచయమై కేవలం రెండున్నరేళ్లు మాత్రమే’ అని చెప్పింది. కాగా ఈ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకి ఇటీవలే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేసింది.

చదవండి: పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన

మరిన్ని వార్తలు