గని ప్రపంచం ఇదే.. టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే..?

11 Nov, 2021 12:38 IST|Sakshi

మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున‍్న తాజా చిత్రం గని. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అందులోని వరుణ్‌ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. సినిమా విడుదల కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. అయితే వారిని సంతోషపెట్టేందుకు మూవీ మేకర్స్‌ గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. 

ఈ వీడియోలో హీరోయిన్‌ నుంచి విలన్‌ వరకు కీలకమైన పాత్రలన్నింటినీ చూపించారు. మొదట నదియా, తర్వాత నరేష్‌ కనిపించగా, క‍్రమంగా తనికెళ్ల భరణి, నవీన్‌ చంద్ర, సాయి మంజ్రేకర్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రను చూపించారు. అయితే గని ప్రపంచంలో వీళ్లందరు ఉంటారనట్లుగా వీడియో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్‌ చూస్తే ఆ అంచనా రెట్టింపు అయ్యేలా ఉంది. బాలీవుడ్‌ నటుడు మహేష్‌ ముంజ్రేకర్‌ కుమార్తె సాయి మంజ్రేకర్‌  హీరోయిన్‌గా నటిస్తున్నారు.  అలాగే సినిమా టీజర్‌ను నవంబర్‌ 15న రిలీజ్‌ చేయనున్నట్లు వీడియోలో చూపించారు. 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్‌ పిక్చర్స్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అల‍్లు వెంకటేష్‌, సిద్దు ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గని చిత్రాన్ని డిసెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు