దర్శకుడి జర్నీ నేపథ్యంలో ‘ఘరానా మొగుడు’ షూటింగ్ ప్రారంభం

11 Aug, 2021 22:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్. ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్, హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్.కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానామొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండలోని శివాలయంలో పూజకార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పైగౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు, జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు.

పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ..మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్‌తో తనుసినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయంసాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు. 

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ... మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్‌ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు. వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది. ఇప్పుడు  ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తుంది. ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే. ఈ చిత్రం మోహన్‌కు, వర్శవిశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. 

చిత్ర  నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ .. ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ 3లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకుచాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారునటిస్తున్నారు. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికిముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ ఘరానా మొగుడుసినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. మొదటిసారి నేను మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో తను ఈ సినిమాను చేద్దామని చెప్పారు. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు