God Father Movie Collections: లూసిఫర్‌ కలెక్షన్ల కంటే వెనుకంజలో గాడ్‌ఫాదర్?

24 Oct, 2022 15:07 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్‌ స్క్రీన్‌పై విడుదలైంది. మోహన్‌ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్‌ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్‌ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. 

(చదవండి: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే)

కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్‌తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్‌ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్‌లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్‌ను దాటలేకపోయింది. 

ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్  సంగీతమందించారు.  

మరిన్ని వార్తలు