భీకర యుద్ధం మొదలవ్వబోతోంది

25 Jan, 2021 16:15 IST|Sakshi

రెండు అతి భారీ ప్రాణుల మధ్య భీకర యుద్ధం మొదలవ్వబోతోంది. నిజంగా కాదు! ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్’‌ సినిమాలో. ఆదామ్‌ విన్‌గార్డ్‌ డైరెక్షన్‌లో వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. ‘‘మనకు ఇదొక్కటే మార్గం’’ అన్న డైలాగ్‌తో మొదలై.. ‘‘ కాంగో ఎవరి ముందు తలవంచడు’’ అన్న డైలాగ్‌ వరకు ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. రెండిటి మధ్య పోరాట సన్ని వేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరాన్ని నాశనం చేయటానికి పూనుకున్న గాడ్జిల్లాను అంతమొందించటానికి మనుషులు కాంగ్‌ను రంగంలోకి దించుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ( బాండ్‌ మళ్లీ వాయిదా )

గాడ్జిల్లా, కాంగ్‌లు ప్రధాన పాత్రలుగా ఇంతవరకు చాలా సినిమాలు వచ్చాయి. గాడ్జిల్లా: కింగ్‌ ఆఫ్‌ ది మాన్‌స్టర్స్‌, షిన్‌ గాడ్జిల్లా, గాడ్జిల్లా: ప్లానెట్‌ ఆఫ్‌‌ ది మాన్‌స్టర్స్‌, గాడ్జిల్లా: సిటీ ఆఫ్ ‌ది ఎడ్జ్‌ ఆఫ్‌ బ్యాటిల్‌ ఇలా మొత్తం 40 పైగా సినిమాలు వచ్చాయి. ఇక కాంగ్‌ తక్కువ వాడేమీ కాదు! 1933లో వచ్చిన కింగ్‌ కాంగ్‌ మొదలుకుని మొన్నటి కాంగ్‌:స్కల్‌ ఐలాండ్‌ వరకు మొత్తం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. మార్చి 26న హెచ్‌బీఓ మ్యాక్స్‌తో పాటు థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు