రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన నటి.. పరిస్థితి విషమం

8 Jun, 2021 09:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : హాలీవుడ్‌ నటి లీసా బెన్స్‌(65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం..లీసా బెన్స్‌ వాషింగ్టన్‌లోని లింకన్‌ సెంటర్‌ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్‌ ఆమెను ఢీకొట్టింది. దీంతో నటి లీసాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి అతి వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమాదం తర్వాత బైకుని ఆపకుండా వెళ్లిపోయాడని లాసా మేనేజర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అయితే బాధితుడి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగి రెండు రోజులు అయినా ఇంకా అతడిని అరెస్ట్‌ చేయకపోవడం గమనార్హం. ఇక ‘గాన్ గర్ల్‌’  సినిమాతో ఫేమస్‌ అయిన లీసా బెన్స్‌ ఆ తర్వాత పలు సహాయక పాత్రలతో పాట పలు టీవీ ఫోలలో కూడా పాల్గొం​ది. 

చదవండి : నాలుగేళ్లుగా డేటింగ్‌: పెళ్లి జరగదంటున్న నటుడు
బ్రాడ్​పిట్​కి అనుకూలంగా తీర్పు.. ఇక విడాకులే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు