Mandira Bedi: గుండె బద్దలైంది.. సారీ మందిరా!

30 Jun, 2021 15:04 IST|Sakshi

మా ప్రపంచం చిన్నబోయింది..మంచి మనిషిని  కోల్పోయాం

రాజ్‌  కౌశల్‌ ఆకస్మిక మరణంపై  బాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం

సాక్షి,ముంబై: ప్రముఖ నటి, మోడల్‌ మందిరా బేడీ భర్త రాజ్‌కౌశల్‌ ఆకస్మిక మరణం పలువుర్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో బాలీవుడ్‌ నటీ నటులతో పాటు, మందిరా దంపతుల స్నేహితులు, ఇతర ప్రముఖులు సోషల్‌ మీడియాలో  తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందిరా బేడీకి, ఆమె కుటుంబ సభ్యలుకు  తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

ముఖ‍్యంగా ప్రముఖ నటులు అనుపమ్‌ ఖేర్‌, కబీర్‌బేడీ, మాధవన్‌, నటి నేహా ధూపియా, మనోజ్‌బాజ్‌పాయ్‌ తోపాటు, సింగర్‌ విశాల్ దాద్లానీ తమ సానుభూతి ప్రకటించారు. 49 సంవత్సరాల చిన్న వయసులో ఆయన మరణం తీరని విషాదమంటూ ట్వీట్‌ చేశారు. రాజ్ కౌశల్‌ దర్శకత్వంలో వచ్చిన ఆంథోనీ కౌన్ హై మూవీలో నటించిన మినీషా లాంబా, ఆంథోనీ కౌన్ హై చిత్రంలో ఆయనతో పనిచేసిన అర్షద్ వార్సీ ట్విటర్‌ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు.  ఇంకా కృతి కర్బందా, రణదీప్‌ హుడా, లారా దత్తా, రణ్‌వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాద్వారా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

కాగా  భర్త రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో మందిరాబేడీ  తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  దీంతో బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా నివాసానికి చేరుకుని ఆమెను ఓదార్చారు. స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో  బుధవారం అంత్యక్రియలను పూర్తి చేశారు. తీరని దుంఖంతో పిల్లలను ఓదార్చుతూ మందిరా తన భర్తకు అంతిమ సంస్మారాలను పూర్తి  చేసిన  వైనం  కంటతడిపెట్టించింది.

చదవండి :  ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్ షా

మరిన్ని వార్తలు