కీర్తీ సురేష్‌.. ‘గుడ్ ల‌క్ స‌ఖి’

16 Aug, 2020 15:26 IST|Sakshi

'మ‌హాన‌టి'తో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్‌. ఆమె తాజాగా న‌టిస్తోన్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం "గుడ్ ల‌క్ స‌ఖి". ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్ విశేషంగా ఆక‌ర్షిస్తోంది. గ్లామ‌ర్‌కు దూరంగా, ప‌ల్లెటూరి ప‌డుచు పిల్ల పాత్ర‌లో కీర్తి ఒదిగిపోయారు. ఆరు మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న స‌ఖి టీజ‌ర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమె న‌ట‌నకు మ‌రోసారి ఫిదా అవుతున్న అభిమానులు కీర్తికి మ‌రో జాతీయ అవార్డు ఇవ్వాల్సిందేనంటున్నారు. 'ల‌క్ అనేది లేదు', 'మ‌న రాత మ‌న‌మే రాసుకోవాల' అనే డైలాగులు నిజ జీవితంలోనూ ఇన్‌స్పిరేష‌నే అని చెప్తున్నారు. (గుడ్‌లక్‌ సఖి.. టీజర్‌ వచ్చేసింది)

ఈ సినిమాలో కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్ర‌లో ఆది పినిశెట్టి, ఆమెకు శిక్ష‌ణ‌నిచ్చే కోచ్ పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఓ చిన్న షెడ్యూల్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌యింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. నాగేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హి‌స్తుండ‌గా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.‌ ‘దిల్‌’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. కాగా ఆమె సాని కాయితం(పేడ పేప‌ర్‌) అనే కొత్త‌ సినిమా చేయ‌బోతున్న‌ట్లు శనివారం వెల్ల‌డించారు. శ‌నివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి వీపు వెన‌క వేట కొడ‌వ‌లి పెట్టుకుని, ఎడ‌మ చేతిలో తుపాకీ ప‌ట్టుకుని నాటు పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. (ఆ లవ్‌ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు