Sirivennela Sitaramasastry: సిరివెన్నెలకు గూగుల్‌ నివాళి.. 'ట్రెండింగ్‌ సెర్చ్‌' ట్వీట్‌

1 Dec, 2021 10:13 IST|Sakshi

Google India Tribute To Sirivennela Sitaramasastry: జగమంత కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఒంటరి చేసి లోకాన్ని విడిచిపెట్టారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 'సిరివెన్నెల' సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని, సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మెలోడీలు, జాగృతం, జానపదం , శృంగారం, విప్లవాత్మక గీతాలను అందించారు. ఆయన పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత సిరివెన్నెల. సిరివెన్నెల సీతరామ శాస్త్రి కలం సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అలాంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం సాహిత్యాభిమానులు, ప్రేక్షకులు, సినీ పెద్దలు, రాజకీయనాయకులు ఒకరేంటీ యావత్‌ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆ దిగ్గజ కవితో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. 

ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. 'సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అని గూగుల్ ఇండియా ట్వీట్‌ చేసింది. 'ఓకే గూగల్‌, ప్లే సిరివెన్నెల సాంగ్స్‌' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్‌ సెర్చ్‌ను తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. 

ఇది చదవండి: టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత

మరిన్ని వార్తలు