గోపీచంద్‌ భీమా మూవీ.. హీరోతో జోడీ కట్టనున్న కుర్ర హీరోయిన్లు వీళ్లే!

11 Aug, 2023 01:08 IST|Sakshi
ప్రియ భవానీ శంకర్, మాళవికా శర్మ 

గోపీచంద్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్‌ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్‌. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు