‘జీరో’ని నమ్ముకున్న హీరో.. గోపీచంద్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేనా?

15 Dec, 2022 17:47 IST|Sakshi

ఆసెంటిమెంట్‌ను వదలను అంటున్నాడు మాచోస్టార్‌ గోపీచంద్‌. తన అపజయాలకు బ్రేక్ వేయాలి అంటే..పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. నెక్ట్స్‌ సినిమాకు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇంతకీ..మాచో స్టార్ సెంట్ మెంట్ ఏంటి అంటారా? ‘సున్నా’. ఇప్పుడు ఈ హీరో జీరోని నమ్ముకుంటున్నాడు. 

గోపీచంద్ కు జయం,వర్షం సినిమాలు విలన్ గా పేరు తీసుకువస్తే,యజ్నం,రణం,లక్ష్యం,సాహసం,లౌక్యం లాంటి సినిమాలు హీరోగా నిలబెట్టాయి. ఈ సినిమాలన్ని గోపి హిట్ లిస్ట్‌లోకి వచ్చాయి. గోపీకి గుర్తింపు తెచ్చిన సినిమాల టైటిల్స్ చివరలో సున్నా ఉండటం  విశేషం. సున్నా టైటిల్స్ తో ఎండ్ అయినా సినిమాలు..హిట్ కావటంతో..గోపీచంద్ కూడా ఇది సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు.

టైటిల్స్ చివరలో సున్నా లేకుండా ఒంటరి,వాంటెడ్, జిల్,ఆక్సిజన్,చాణక్య ,అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలలో నటించాడు .ఈ సినిమాలన్ని డిజాస్టర్ లిస్ట్‌లోకి ఎక్కాయి. ఇలా సున్నా టైటిల్ తో ఎండ్ అయిన సినిమాలు విజయం సాధించటంతో..తన రాబోతున్న సినిమాకు కూడా పేరు చివరలో సున్నా వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడు. 

గోపీచంద్‌ ప్రస్తుతం..శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం,లౌక్యం లాంటి హిట్లు వచ్చాయి .ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్‌ చివరలో సున్నా వచ్చేలా..రామ బాణం టైటిల్ ఫిక్స్ చేశారట. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు,ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గోపీచంద్ నమ్ముకున్న సున్నా సెంటిమెంట్ వర్కౌట్ అయి..రామ బాణం విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు