ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వీరసింహారెడ్డి’ చేశా: గోపీచంద్‌

14 Jan, 2023 07:32 IST|Sakshi

‘‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని ఒక అవకాశంగా కంటే ఒక బాధ్యతగా చూశాను. ‘అఖండ’ మూవీ హిట్, అన్‌ స్టాపబుల్‌ షోతో అందరికీ కనెక్ట్‌ అయ్యారు బాలకృష్ణగారు.. ఇప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్‌ బాలయ్య బాబు అభిమానులే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాను’’ అని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్స్‌ ‘సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు’ చిత్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’లోనూ ఉంది. ఇందులో ఉన్న సిస్టర్‌ సెంటిమెంట్‌ కనెక్ట్‌ అయింది. ఫస్ట్‌ హాఫ్‌ అయ్యాక ఫ్యాన్స్‌ అందరూ ఇరగదీశారని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. సెకండ్‌ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ ఇంకా గొప్పగా కనెక్ట్‌ అయ్యింది.. దాంతో విజయంపై మా నమ్మకం నిజమైంది. ఈ చిత్రాన్ని ఫస్ట్‌ హాఫ్‌ బాలయ్యబాబు ఫ్యాన్‌ బాయ్‌గా, సెకండాఫ్‌ డైరెక్టర్‌గా చేశాను. రామ్‌–లక్ష్మణ్‌లు ఫైట్స్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు. నా కెరీర్‌లో బెస్ట్‌ ప్రొడ్యూసర్స్‌ మైత్రీ మూవీ మేకర్స్‌.. వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు.  

మరిన్ని వార్తలు