Gopichand: గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

30 Mar, 2022 19:18 IST|Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌తో ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్‌లో ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌.

చదవండి: మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు

జులై 1, 2022న పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నామంటూ మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. మారుతి డైరెక్షన్‌లో ఔట్‌ అండ్‌  ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్‌, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు