Gopichand Ramabanam Movie Review: 'రామబాణం' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

5 May, 2023 13:02 IST|Sakshi
Rating:  

టైటిల్: రామబాణం

నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తదితరులు

నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

దర్శకత్వం: శ్రీవాస్

సంగీతం: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి

ఎడిటర్: ప్రవీణ్ పూడి


మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. అన్నదమ్ముల రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీతో భిన్నమైన ఎలివేషన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


అసలు కథేంటంటే..
రాజారాం(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ ఆర్గానిక్ ఫుడ్ హోటల్ వ్యాపారం చేస్తుంటారు. రాజారాంకు తమ్ముడి విక్కీ( గోపీచంద్) బిజినెస్‌లో సాయంగా ఉంటాడు. అక్కడే పాపారావు(నాజర్‌) హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.  రాజారాం తక్కువ ధరకే ఫుడ్ అందించడాన్ని ఓర్వలేని పాపారావు.. జగపతిబాబుతో గొడవలకు దిగుతాడు. ఇది చూసి సహించలేని విక్కీ.. పాపారావు గోడౌన్‌ను తగలబెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజారాం.. విక్కీని మందలిస్తాడు. నీతి, నిజాయితీ అనుకుంటూ తిరిగే రాజారాం తీరు నచ్చక చిన్నప్పుడే కోల్‌కతాకు పారిపోతాడు విక్కీ. అక్కడ గుప్తా అనే వ్యక్తి విక్కీని చేరదీస్తాడు. ఆ తర్వాత కోల్‌కతాను తన గుప్పిట్లో పెట్టుకున్న డాన్ ముఖర్జీ సామ్రాజ్యాన్ని కూలదోసి.. తానే విక్కీ భాయ్‌గా చెలామణి అవుతాడు. అదేక్రమంలో భైరవి(డింపుల్ హయాతి)ప్రేమిస్తాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి భైరవి నాన్న(సచిన్ ఖేడేకర్) ఓ కండీషన్ పెడతాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తాడు విక్కీ.  

(చదవండి: నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నా : సెల్వ రాఘవన్‌)

కోల్‍కతా నుంచి వచ్చిన విక్కీని.. అన్న రాజారాం సంతోషంతో ఆహ్వానిస్తాడు. అయిదే పాపారావు(నాజర్), అతని అల్లుడు జీకే(తరుణ్ అరోరా)తో జరిగిన గొడవల గురించి విక్కీకి తెలియకుండా జాగ్రత్తపడతాడు రాజారాం. అదేవిధంగా విక్కీ సైతం తన కోల్‌కతాలో భాయ్ అన్న విషయాన్ని దాచిపెడతాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో రాజా రాంను వ్యాపారంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తారు నాజర్, జీకే. అసలు వాళ్లిద్దరూ రాజారాంను ఢీ కొట్టేందుకు చేసిన ప్లానేంటి? కోల్‌కతా నుంచి వచ్చిన విక్కీ ఏం చేశాడు? విక్కీకి భైరవి నాన్న పెట్టిన కండీషన్ ఏంటి? అసలు అన్న రాజారాం కోసం విక్కీ ఏం చేశాడు?  వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే అసలు కథ.


కథ ఎలా సాగిందంటే...
లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. డైరెక్టర్‌ శ్రీవాస్ సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, డిఫెరెంట్‌ ఎలివేషన్స్ ఉంటాయని తెలిసిందే. కథను హీరో గోపీచంద్‌ను చూపించడంతోనే మొదలెట్టాడు. సినిమా ప్రారంభంలోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరో కోల్‌కతా వెళ్లడం.. విక్కీ భాయ్‌గా ఎదగడం చకాచకా జరిగిపోతాయి. సినీ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించకుండా కథను వేగంగా తీసుకెళ్లాడు. కథను ఎక్కడే గానీ సాగతీయలేదు. స్టోరీ రోటీన్‌గా అనిపించినా కామెడీ సీన్స్, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌కు బోరు కొట్టించకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడనే చెప్పాలి. అయితే కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్‌తో ఫస్టాప్ సింపుల్‌గా ముగించాడు. కథలో సీన్స్ ప్రేక్షకుని ఊహకు అందేలా ఉంటాయి. 

సెకండాఫ్‌ వచ్చేసరికి కథ మొత్తం అన్నదమ్ములు విక్కీ, రాజారాం.. విలన్స్ నాజర్‌, జీకే చుట్టే తిరుగుతుంది. అన్నకు తెలియకుండా తమ్ముడు.. తమ్ముడికి తెలియకుండా అన్న ఒకరికోసం ఒకరు ఆరాటపడే ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కథను ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో శ్రీవాస్ తన మార్క్‌ను చూపించాడు. బ్రదర్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. అక్కడక్కడా బోరుగా అనిపించినా.. కామెడీ సీన్స్‌తో నెట్టుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ చూపిస్తూనే ప్రేక్షకులను ఓ సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ‍్యాన్స్‌కు మాత్రమే ఫర్వాలేదనిపించేలా ఉంది. మాస్ ఆడియన్స్‌కు కాస్తా బోరుగానే అనిపించేలా కథనం సాగుతుంది.  

ఎవరెలా చేశారంటే...
మాచో స్టార్ గోపీచంద్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. ఫైట్ సీన్స్‌, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ డింపుల్ హయాతి ఫర్వాలేదనిపించింది. సాంగ్స్‌లో తన గ్లామర్‌తో అలరించింది. గోపీచంద్ అన్న, వదినలుగా జగపతిబాబు, ఖుష్బూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పుడు సీరియస్‌ పాత్రలు చేసే జగపతి బాబు.. ఈసారి సైలెంట్‌ క్యారెక్టర్‌లోనూ మెప్పించాడు. నాజర్, అలీ, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఎడటింగ్‌లో కొన్ని సీన్స్‌కు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్తాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Rating:  
(2.25/5)
మరిన్ని వార్తలు