Grammy Awards 2022: కరోనా, ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. 64వ గ్రామీ అవార్డుల వేడుక వాయిదా

7 Jan, 2022 18:54 IST|Sakshi

Grammy Awards 2022 Postponed Amid Corona And Omicron: కరోనా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశంలో సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది తారలు కరోనా బారిన పడ్డారు. అలాగే కరోనా, ఒమిక్రాన్‌లు తమ సత్తా చాటుతుండటంతో పాన్‌ ఇండియా సినిమాలతోపాటు పెద్ద చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా సంగీతంలో అద్భుత ప్రదర‍్శన కనబర్చిన కళకారులకు గౌరవార్థంగా ఇచ్చే గ్రామీ అవార్డుల వేడుక (Grammy Awards 2022) వాయిదా పడింది. అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌లో జనవరి 31న నిర్వహించాల్సిన ఈ వేడుకలను కరోనా, ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో పోస్ట్‌పోన్‌ చేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్‌ (CBS), ది రికార్డింగ్‌ అకాడమీ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. 

ఇదీ చదవండి: స్టార్‌ హీరోకు కరోనా పాజిటివ్‌.. వీలైనంత త్వరగా కోలుకుంటా

అమెరికాలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున వేడుక నిర్వాహకులకు ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ భావించినట్లు సమాచారం. సంగీత నిర్వాకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని అకాడమీ అధికారులు తెలిపారు. త్వరలో కొత్త తేదిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు నామినేషన్లను నవంబర్‌లో ప్రకటించారు. అయితే గతేడాది కూడా కరోనా వల్ల గ్రామీ అవార్డులు కొంతకాలం వాయిదా వేయాల్సి వచ్చింది. 2021లో జనవరిలో జరగాల్సిన ఈ అవార్డు వేడుకలు మార్చిలో నిర్వహించారు. అలాగే స్టేపుల్స్‌  సెంటర్‌కు బదులుగా లాస్‌ ఏంజిల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లోని అవుట్‌డోర్‌ సెట్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. సెలబ్రిటీలు కూర్చునే ప్రదేశాన్ని మార్చడంతోపాటు సీటింగ్‌ కెపాసిటీ సైతం తగ్గించారు. ఈ ఏడాది లాస్‌ ఎంజిల్స్‌ డౌన్‌టౌన్‌లోని అరెనాలో జరగాల్సిన 64వ గ్రామీ అవార్డులు (64Th Grammy Awards) ఎక్కడ నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది. 
 

A post shared by Recording Academy / GRAMMYs (@recordingacademy)

ఇదీ చదవండి: నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్‌ స్పందన.. అది నేను కాదు కానీ

మరిన్ని వార్తలు