గ్రామీ అవార్డ్స్‌ వాయిదా

7 Jan, 2021 00:18 IST|Sakshi

హాలీవుడ్‌ ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్‌ గ్రామీ అవార్డ్స్‌ పోస్ట్‌పోన్‌ అయ్యాయి. మ్యూజిక్‌ ఇండస్ట్రీలో జరిగే పాపులర్‌ అవార్డుల వేడుక గ్రామీ. ఈ నెల  31న లాస్‌ ఏంజెల్స్‌లో జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేశారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేశారు. ‘‘ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు గ్రామీ అవార్డు నిర్వాహకులు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు