జూ.ఎన్టీఆర్‌కు అభిమానుల ఘన స్వాగతం.. కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం..

15 Mar, 2023 08:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.  అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి.

మరిన్ని వార్తలు