టైటిల్‌ గెస్‌ చేస్తే చాలు... సినిమాలో నటించొచ్చు!

3 Sep, 2022 15:38 IST|Sakshi

ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రీ లుక్   పోస్టర్ విడుదల 

మెగాస్టార్‌ చిరంజీవి వీరాభిమాని రమేశ్‌ హీరోగా ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా  ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలైంది. రక్తంతో తడిసిన పదునైన కత్తిని ఎవ్వరికీ కనిపించకుండా వీపున దాచి పెట్టిన హీరో లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ ప్రీ లుక్  పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ జానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో ఏదో కొత్త వైవిద్యం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.

కాగా, ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ గెస్ చేసే అవకాశం ప్రేక్షకులకే కల్పించింది చిత్రయూనిట్. ఎవ్వరైతే ఈ టైటిల్ గెస్ చేసి ఈ మెయిల్ కి  (Info@smlproductions) పంపిస్తారో వారికి తమ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

మరిన్ని వార్తలు