Shah Rukh Khan: క్రిమినల్‌ కేసులో షారుక్‌కు గుజరాత్‌ హైకోర్టులో ఊరట

28 Apr, 2022 20:05 IST|Sakshi

Gujarat HC Relief To Shah Rukh Khan Over Criminal Case: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు గుజరాత్‌ హైకోర్టు ఊరట ఇచ్చింది. షారుక్‌ ‘రయీస్‌’ మూవీ ప్రమోషన్‌ ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో మృతుడు కుటుంబ సభ్యులు వడోదర కోర్టులో షారుక్‌పై కేసు నమోదు చేశారు. అయితే తనపై ఉన్న క్రిమినల్‌ కేసు, దిగువ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ షారుక్‌ ఇటీవల గుజరాత్‌ హైకోర్టులో పటిషన్‌ వేశాడు.  ఈ పిటిషన్‌పై బుధవారం(ఏప్రిల్‌ 27న) విచారణ చేపట్టిన గుజరాత్‌ హైకోర్టు ఈ కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి షారుక్‌ ఖాన్‌పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

చదవండి: గుండెపోటుతో ప్రముఖ సీనియర్‌ నటుడు మృతి

షారుక్‌ తన మూవీ ప్రమోషన్‌లో భాగంగానే అలా చేశాడని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టమవుతోందని పేర్కొంటూ హైకోర్టు షారుక్‌పై ఈకేసును ఎత్తివేసింది. వివరాలు.. షారుక్‌ 2017లో నటించిన రయీస్‌ సినిమా ప్రమోషన్‌ భాగంగా వడోదర రైల్వేస్టేషన్‌ సమీపంలో షారుక్‌ ఆకస్మాత్తుగా పర్యటించాడు. దీంతో అతడిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఫర్హీద్‌ ఖాన్‌ పఠాన్‌ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అంతేకాదు మరికొందరు గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్‌పై మొదట స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్‌, బాలీవుడ్‌ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్‌

అయితే ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోలంకి వడోదర కోర్టును ఆశ్రయించాడు. షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్‌ను విసరడం, టీషర్ట్స్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించాడు. అదే ఈ తొక్కిసలాటకు, అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైందని పేర్కొన్నాడు. దీంతో వడోదర కోర్టు షారుక్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి సమన్లు ఇచ్చింది. దీంతో తనపై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ షారుఖ్ గుజరాత్‌ హైకోర్టు జస్టిస్‌ నిఖిల్‌ కరీల్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 27న షారుక్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి అతడికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించారు. 

మరిన్ని వార్తలు