స్ఫూర్తి నింపుతున్న జాన్వీ సినిమా ట్రైలర్‌

1 Aug, 2020 11:48 IST|Sakshi

కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన  గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా ఎంత బాగుందో, ఎంత మందిలో స్ఫూర్తి నింపుతుందో అనడానికి ఈ ట్రైలర్‌లో ఉండే ఒక్క డైలాగ్‌ చాలు. ​‘నేను దీన్ని చేయగలను’ అని చెప్పడం ద్వారా మీరు గౌరవం సంపాదించరు, మీరు మీ తలని కిందికి ఉంచి, చేయడం ద్వారా సంపాదించగలరు’. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ గుంజన్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో విమానం నడపాలి అనే ఆసక్తి ఉన్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహాపరుస్తుంది. వాటిని అధిగమించి ఆమె ఎలా తన కలని నెరవేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధం కార్గిల్‌ వార్‌లో విమానం  నడిపిన మొదటి మహిళగా గుంజన్‌ రికార్డు సంపాదించారు. తన పనితో అ‍మ్మాయిలు బలహీనులు కఠినమైన పనులు చేయలేరు అని చెప్పిన వారికి తన సత్తా చూపించారు. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ సినిమాలో చూపించినట్లు అర్థం అవుతుంది. 

పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో జాన్వి తండ్రిగా నటించారు. కూతురును వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రిగా ఆయన ఈ సినిమాలోనటించారు. ‘ ఒక స్త్రీ లేదా పురుషుడు విమానం నడుపుతుంటే వారిని పైలెట్‌  అనే పిలుస్తారు’ అని ఆయన చెప్పే డైలాగ్‌ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో  నెట్‌ఫ్లిక్స్‌లో  విడుదల చేయనున్నారు.  శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్ , అయేషా రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం గురించి పంకజ్ మాట్లాడుతూ,   “నాకు ఈ పాత్ర చాలా నచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌లో నేను చాలా ఆనందించాను. జాన్వీ చాలా నిజాయితీ గల నటి. ఆమె నన్ను చాలా గౌరవిస్తుంది, నాకు కూడా ఆమె పని పట్ల చిత్తశుద్ధి ,నిబద్ధత కలిగి వుండటం చూసి చాలా గౌరవం పెరిగింది.  శరణ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు’ అని పేర్కొన్నారు. 

చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ

మరిన్ని వార్తలు