జిమ్ పిక్స్ షేర్ చేసిన 'గురు' హీరోయిన్.. నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్!

12 Sep, 2023 14:20 IST|Sakshi

రితికా సింగ్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గురు మూవీతో టాలీవుడ్‌లో సినీరంగ ప్రవేశం చేసిన భామ.. తొలి చిత్రానికే నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ అనే సినిమా చేశారు. ఇటీవలే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్‌ కోత చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు.  కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!)

రితికా జిమ్‌లో సాధన చేసిన తర్వాత ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ మరీ ఇంత బోల్డ్‌గా ఉన్న ఫోటోలు షేర్ చేయడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే దారుణంగా పోస్టులు పెడుతున్నారు.  కాగా.. ఇటీవలే ఆమె మరీ లావుగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసమే తాను బరువు తగ్గి మళ్లీ స్లిమ్ అయ్యానంటూ రితికా పిక్స్ షేర్ చేశారు. అంతే కాకుండా బొద్దుగా ఉన్న శరీరానికి వీడ్కోలు పలుకుతున్నట్లు రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కాగా.. రితికా సింగ్ తమిళ చిత్రం 'ఇరుధి సూత్ర'తో ఫేమస్ అయింది. 'ఆండవన్ కోమండి', 'శివలింగ', 'ఓ మై గాడ్' 'కోలా', బిచ్చగాడు-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా రితికా మార్షల్ ఆర్టిస్ట్ కూడా. అయితే నెటిజన్స్ మాత్రం హాట్‌ ఫోటో షూట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని వార్తలు