కొత్తగా గుట్టు చప్పుడు

27 Aug, 2020 06:17 IST|Sakshi
లివింగ్‌ స్టన్‌

అభిషేక్, ఐశ్వర్య జంటగా మణీంద్రన్‌ దర్శకత్వంలో డాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ (డ్రీమ్స్‌ ఆఫ్‌ నెట్‌వర్క్‌) బ్యానర్‌పై లివింగ్‌ స్టన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన అనంతరం లివింగ్‌ స్టన్‌ మాట్లాడుతూ– ‘‘నేటి యువతీ యువకుల బాధ్యతారాహిత్యానికి, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా మణీంద్రన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లవ్, రొమా¯Œ ్స, థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. మా బ్యానర్‌లో మరో పెద్ద బడ్జెట్‌ సినిమా కూడా నిర్మాణంలో ఉంది’’ అన్నారు. ‘‘మంచి కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు మణీంద్రన్‌. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి, కెమెరామెన్‌: రాము, రచయిత: వై. సురేష్‌ కుమార్, ఎడిటింగ్‌: శివకుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా