జీవీ నుంచి మరో హాలీవుడ్‌ సాంగ్‌ 

14 Nov, 2020 08:32 IST|Sakshi

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ రూపొందించిన హాలీవుడ్‌ ఆల్బమ్‌ నుంచి మరో ఇంగ్లిష్‌ సాంగ్‌ విడుదలకు సిద్ధమైంది. సంగీత దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్లో విజయవంతమైన పయనాన్ని సాగిస్తున్న జీవీ ఇప్పుడు ఇంగ్లిషు పాటల ఆల్బమ్‌తో హాలీవుడ్‌ సంగీత ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమయ్యారు. ఈయన సూరరై పోట్రు చిత్రానికి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ టైంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంటోంది. ఇందులో జీవీ సమకూర్చిన సంగీతానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి.

జీవీ ఇటీవల ‘గోల్డ్‌ నైట్స్’‌ పేరుతో ఒక ఇంగ్లిష్‌ ఆల్బమ్‌ను రూపొందించారు. అందులోని ‘హై అండ్‌ డ్రై’ అనే పాటను గత సెప్టెంబర్‌ 17వ తేదీన విడుదల చేయగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అదే ఆల్బంలోని ‘క్రయింగ్‌ అవుట్’‌ అనే మరో పాటను ఈనెల 19న నటుడు ధనుష్‌ చేతుల మీదగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటను జీవీ, కెనడాకు చెందిన జూలియా గర్దా కలిసి పాడడం విశేషం.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు