క్యాన్సర్‌ నుంచి కోలుకున్న హంసానందిని  ఇప్పుడెలా ఉందో తెలుసా?

7 Jan, 2023 18:45 IST|Sakshi

టాలీవుడ్‌లో గ్లామరస్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాలభామ హంసానందిని. అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఈ భామ ఇటీవలె దాన్నుంచి బయటపడింది.

అంతేకాకుండా క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత సినిమా షూటింగులోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే తాజాగా తన లేటెస్ట్‌ ఫోటోలను పంచుకుంది హంసానంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 


 

మరిన్ని వార్తలు