మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు

12 May, 2021 09:47 IST|Sakshi

‘దిల్‌ పే మత్‌ లే యార్‌’, ‘సిటీలైట్స్‌’, ‘సిమ్రాన్‌’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్‌ 1992’ (వెబ్‌ సిరీస్‌) కూడా తీసిన బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హన్సల్‌ మెహతా కరోనా బారిన పడ్డారు. ‘‘నాతో పాటు మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా సోకిన తర్వాత నా కుమారుడి పరిస్థితి ఓ సందర్భంలో కలవరపెట్టింది. మా ఆరోగ్యాలు కూడా బాగోలేకపోవడంతో మా కుమారుడి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడంలో మేం నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చింది'

'కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మేం కోలుకునే స్థితిలోకి వచ్చాం. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. మేం సేఫ్‌గా ఫీలయ్యేలా చేసింది. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. అలాగే మీలో ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి’’ అని పేర్కొన్నారు హన్సల్‌.

చదవండి: 19 ఏళ్లకే సెలబ్రిటీ, నెలకు రూ.6 లక్షల సంపాదన! 

రెమి‌డెసివిర్‌ అడిగిన ప్రముఖ దర్శకుడు: ఊహించని స్పందన

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు