వివాదంలో హన్సిక మూవీ: కోర్టుకెక్కిన డైరెక్టర్‌

16 May, 2021 08:41 IST|Sakshi

హీరోయిన్‌ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మహా’ పై వివాదం నెలకొంది. యు.ఆర్‌. జమీల్‌ దర్శకత్వం వహించారు. కాగా ‘‘నేను దర్శకత్వం వహించిన ‘మహా’ని నాకు చెప్పుకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.. దీనిపై నిషేధం విధించాలి’’ అని జమీల్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. హన్సిక టైటిల్‌ రోల్‌ చేసిన ‘మహా’ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది.

‘‘ఈ చిత్రం పెండింగ్‌ పనులు నాకు తెలియకుండానే పూర్తి చేశారు.. నిర్మాత (మదియళగన్‌) నాకు 24 లక్షలు పారితోషికం చెల్లించాల్సి ఉండగా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారు. నాకు తెలియకుండానే పెండింగ్‌ చిత్రీకరణ పూర్తి చేసినందున, నా కథ మార్చినందున రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ బకాయి చెల్లించాలి’’ అని కేసు పెట్టారు జమీల్‌. అంతేకాదు.. సినిమా రిలీజ్‌ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని విధించాలని కూడా  కోర్టులో పిటిషన్‌ వేశారు. ‘జమీల్‌ పిటిషన్‌పై మే 19లోగా స్పందించాలి’ అంటూ సదరు కోర్డు నిర్మాతను ఆదేశించింది. కాగా ఒక పైలెట్‌తో ప్రేమలో పడే పైలెట్‌ అటెండెంట్‌ (హన్సిక) కథ ఇది. ఈ జంటకు పుట్టిన కుమార్తె మరణం వెనక దుర్మార్గుల్ని హీరో ఎలా పట్టుకుని అంతం చేశాడు? అనేది ‘మహా’ చిత్రకథ. ఇందులో శింబు అతిథి పాత్రలో కనిపిస్తారు.

చదవండి: రెమ్యునరేషన్‌ పెంచిన తమన్‌.. ఒక్కో మూవీకి ఎంతంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు