మహా పూర్తయింది

1 Nov, 2020 00:50 IST|Sakshi
హన్సిక

హీరోయిన్‌గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. 50వ సినిమా కోసం ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్‌ కథను ఎంచుకున్నారామె. ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్‌ షేడ్స్‌ కూడా ఉంటాయట. అతిథి పాత్రలో శింబు మెరవనున్నారు.

సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో శింబు కనిపిస్తారట. కోవిడ్‌ తర్వాత ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభించి, పూర్తి చేశారు కూడా. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ – ‘‘నా 50వ సినిమా షూటింగ్‌ పూర్తిచేశాం. మహా పాత్రకు బైబై. ఇదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమాలో భాగం అయిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు