హీరోయిన్‌ హన్సిక ఇంట పెళ్లి సందడి!

26 Mar, 2021 11:39 IST|Sakshi

‘దేశముదురు’తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన హన్సిక తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులతో నటించి, తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే ఈ ముద్దు గుమ్మకు ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ఈ మధ్య తెలుగు తెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా వుంటే తన అన్నయ్య ప్రశాంత్ మోత్వానీకి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న జైపూర్‌లో వివాహం జరిగింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా కేవలం బంధువులను, సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ఆ వేడుకల్లో హన్సిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక పెళ్లిలో తమ సంప్రదాయ దుస్తులు, నగలను ధరించిన హన్సిక బుట్ట బొమ్మలా కనిపించింది. అతిథులతో ముచ్చట్లు పెడుతూ, తోబుట్టువులను ఆటపట్టిస్తూ, డాన్స్‌ చేస్తూ.. ధూమ్‌ధామ్‌గా‌ సందడి చేసింది. అప్పుడే తన వదిన నాన్సీతో బలమైన బంధం ఏర్పడిందని, ఈ వివాహం తర్వాత మేము సోదరీమణులం అయ్యామని పేర్కొంది. పెళ్లి వేడుకల్లో తీసుకున్న కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోగా అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. మార్చి 21న ఎంగేజ్‌మెంట్‌తో మొదలైన ఈ సంబరాలు పెళ్లితో ముగిసాయి. 


ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియంటడ్‌ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'మహా'లో నటిస్తోంది. కోలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ విలన్‌గా చేస్తున్నాడు. శింబు ఓ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఆమె సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్‌.జమీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. కోవిడ్‌ కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.  ( చదవండి : మాజీ ప్రియురాలితో.. )

హన్సిక ఇంట్లో పెళ్లి సందడి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు