Hansika Motwani: డిసెంబర్‌లో దేశముదురు హీరోయిన్‌ పెళ్లి, ఎక్కడంటే?

16 Oct, 2022 20:33 IST|Sakshi

ఇండస్ట్రీలో అర్ధసెంచరీ కొట్టేసింది హన్సిక. ఇప్పటివరకు ఆమె 50 సినిమాల్లో నటించింది. అంతేనా? వర్క్‌ చేస్తున్న కొద్దీ తనకు ఊపొస్తుందంటూ వరుస పెట్టి చిత్రాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో దాదాపు పది సినిమాలు హ్యాండిల్‌ చేస్తూ యమ జోరు మీదుంది. వర్క్‌ విషయంలో సంతృప్తిగా ఉన్న హన్సిక ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం మీద ఫోకస్‌ చేసిందట. మొన్నటివరకు ఇప్పుడప్పుడే పెళ్లెందుకు? అని మాట దాటేసిన ఈ హీరోయిన్‌ డిసెంబర్‌లో ఆ తతంగాన్ని జరిపించేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం జైపూర్‌లో 450 ఏళ్ల చరిత్ర ఉన్న ముండోటా ఫోర్ట్‌ అండ్‌ ప్యాలెస్‌ను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏమేం చేయాలో ఇప్పటినుంచే ప్లాన్లు వేసుకుంటున్నారట. అంటే తన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు హన్సిక ఇప్పటినుంచే రెడీ అవుతోందన్నమాట! పెళ్లి తేదీ, వరుడి వివరాలు తెలియాలంటే మాత్రం హన్సిక స్వయంగా నోరు విప్పేవరకు ఆగాల్సిందే!

A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace)

A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace)

A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace)

చదవండి: ప్రభుత్వానికి దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చిన నయన్‌- విఘ్నేశ్‌
ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి, వీడియో చూశారా?

మరిన్ని వార్తలు