‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతీ’ అంటున్న హీరోయిన్‌ హన్సిక

1 Aug, 2021 07:51 IST|Sakshi

హీరోయిన్‌ హన్సిక నటి స్తున్న తాజా లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతీ’. ‘ది హిడెన్‌ ట్రూత్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ముగిసింది. ఆగస్టులో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.

‘‘తన జీవితంలో ఎదురైన సంఘర్షణ, సమస్యలను శ్రుతి ఎలా ఎదుర్కొంది? ఎలా పోరాడింది? అన్నదే కథాంశం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయనటువంటి పాత్రను హన్సిక చేస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి çసహనిర్మాతలు: పవన్‌ కుమార్‌ బండి, ఏజీ ఎలియస్, లైన్‌ ప్రొడ్యూసర్‌:  కె. విజయ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు