Hanu Raghavapudi: ఆ పుస్తకంలో దొరికిన ఉత్తరం వల్లే ‘సీతారామం’ కథ రాశా: హను రాఘవపూడి

23 Jul, 2022 17:43 IST|Sakshi

‘నాకు పాత పుస్తకాలు కొనుక్కోనే అలవాటు ఉంది. అలా ఒక్కసారి కోఠిలో కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్‌ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్‌ అది. అతను దాన్ని కనీసం ఓపెన్‌ కూడా చేయలేదు. ఇది నాకు చాలా . ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా  ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా’ అని దర్శకుడు హను రాఘవపూడి  అన్నారు. 

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా  వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. 

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేయడానికి కారణం?
మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్  అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానాతో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు.  లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే  నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు.

సీతారామంపై మంచి అంచనాలు  ఉన్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? 
ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత  సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. 

సీతారామం కథకు ప్రేరణ?
నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు  ఉంది.  అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం  ఉండి  ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా  ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపింగదచింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్.

తెలుగులో ఇంత మంది  ఉండగ దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? 
కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో  ఉన్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. 

సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ?
విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా  ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి  ఉంది.ఇందులో మ్యూజిక్ అద్భుతంగా  ఉంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు.  

పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ?
పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే.

'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ?
ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ  ఉంటుంది.

రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత  ఉంటుంది ? 
రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 

'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? 
బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది.  ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ  ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో  ఉంటుంది.

వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ?  
వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద  ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. 


సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? 
ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. 

మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? 
సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. 

మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? 
లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ)  

కొత్తగా చేయబోతున్న సినిమాలు ? 
బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది.

మరిన్ని వార్తలు