Varalaxmi Sarathkumar: అంజనమ్మగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

4 Mar, 2022 11:17 IST|Sakshi

 Pan Indian Movie Hanuman First Look Out: యంగ్‌ హీరో తేజ సజ్జ, హీరోయిన్‌ అమృత అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్‌'. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పోస్టర్‌ రిలీజైంది.

పెళ్లికూతురిగా ముస్తాబైన అంజనమ్మ(వరలక్ష్మి) చేతిలో కొబ్బరి బోండాల గుత్తి ఉంది. దీన్ని చేత పట్టుకున్న ఆమె ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ ఆవేశంతో ఊగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ సినీప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు