Mahesh Babu Birthday Special: తెరపై హీరో, తెర వెనక రియల్‌ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’

9 Aug, 2022 08:44 IST|Sakshi

మహేశ్‌ బాబు... ఈ పేరులోనే ఓ బ్రాండ్‌ ఉంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మహేశ్‌ ముందుంటారు. ఎంత పెద్ద స్టార్‌ అయినా... ‘సూపర్ స్టార్‌’ తనయుడైనప్పటికీ సింప్లిసిటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌లా కనిపిస్తారు. ఇంటర్వ్యూలలో తక్కువ మాట్లాడుతూ ఒదిగిపోయే తత్త్వంలో అభిమానుల గుండెల్లో ‘మహర్షి’లా నిలిచిపోయాడు. అందుకే పరిశ్రమలో మహేశ్‌కు సాధారణ ప్రజలే కాదు సెలబెట్రీల్లో సైతం అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. ఆయన స్టేజ్‌పై కనిపిస్తే చాలు అభిమానుల సందడిని ఆపడం ఎవరీతరం కాదు. తెరపై హీరోగా ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకునే ఈ సూపర్‌ స్టార్‌ నిజ జీవితంలో సైతం రియల్‌ హీరోగా అందరి మదిని గెలిచుకున్నాడు. నేడు మహేశ్‌ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా తెర వెనక ఎందరినో ఆదుకున్న ఈ రియల్‌ సేవ కార్యక్రమాల గురించి ఓ సారి చూద్దామా!

ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉంటూ ఎంతో మంది సన్నిహితులు, స్నేహితులను సంపాదించుకున్న మన సూపర్‌ స్టార్‌లో దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువే. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న ఈ ‘శ్రీమంతుడు’. ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆయా గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ కనిపించని ‘నిజం’లా అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌ బో ఆస్పత్రితో కలిసి ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకుంటున్నారు. 

ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు తన భార్య నమ్రతతో కలిసి సొంత ఖర్చులతో వారికి చికత్స చేయించారు. అంతేకాదు ఆర్ధికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న ‘అతిథి’గా మహేశ్‌ అందరిచేత కీర్తించబడుతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా క్టిష్ట పరిస్థితిల్లో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాడు. హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు  విరాళంగా రూ. 2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు. అంతేకాదు గతేడాది తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలను మహమ్మారిన నుంచి రక్షించేందుకు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. 

మరిన్ని వార్తలు