Happy Birthday Movie: పార్టీలో రచ్చ చేసిన లావణ్య.. సాంగ్‌ చూశారా?

4 Jul, 2022 18:01 IST|Sakshi

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా "హ్యాపీ బర్త్ డే" సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్, రివీల్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ జోష్ ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాళభైరవ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, దామినీ భట్ల పాడారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠీ డాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే?
 హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్‌

మరిన్ని వార్తలు