టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ

1 Jun, 2021 13:20 IST|Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్‌. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. జూన్‌1న నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్‌ కళ్ళకు గంతలు కట్టేయగా, దానిపై అనుమమ ఏదో రాస్తున్నట్లు ఆసక్తికరంగా పోస్ట్‌ర్‌ను డిజైన్‌ చేశారు.

ఇక అనుమమ సైతం పోస్టర్‌ను షేర్‌ చేస్తూ.. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్‌​ చేసింది. రొమాంటికి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. 

చదవండి : సిగరెట్‌ కాలుస్తూ హీరో నిఖిల్‌..
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు