ఆర్ఆర్ఆర్ సెట్లో రాజ‌మౌళి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

10 Oct, 2020 13:41 IST|Sakshi

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి త‌న 47వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఆర్ఆర్ఆర్ సెట్లోనే సెల‌బ్రేట్ చేసుకున్నారు. దేశంలోనే అత్యంత సుప్ర‌సిద్ద ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి కూడా ఒక‌రు. ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలామంది న‌టీన‌టులు, అభిమానులు రాజ‌మౌళికి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. జ‌క్క‌నికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేయ‌గా, హ్యాపీ బ‌ర్త్‌డే బాస్ అంటూ రానా ద‌గ్గుబాటి బాహుబ‌లి సినిమాలోని ఓ ఫోటోను జ‌త చేశారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రామ్ పోతినేని, అడ‌విశేష్, డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, సురేంద‌ర్ రెడ్డి స‌హా పలువురు ఇండస్ర్టీ ప్ర‌ముఖులు రాజ‌మౌళికి 47వ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.  (నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి)

ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) అనే భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాఅన్నీ కుదిరి ఉంటే  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.  కానీ, కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో  షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే రెండు రోజుల క్రిత‌మే షూటింగ్ తిరిగి ప్రారంభ‌మ‌య్యింది. ఈ నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రిన్ని అడ్‌బేట్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.  (ఆర్‌ఆర్‌ఆర్: అన్నీ సవ్యంగా సాగి ఉంటేనా!)

మరిన్ని వార్తలు