HappybirthdayUppi: ఏడేళ్లు.. 100 రోజుల సినిమాలు ఏడు! డైలాగులు రాసినా.. డైరెక్ట్‌ చేసినా సెన్సేషనే!

18 Sep, 2021 08:00 IST|Sakshi

సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు.. ఇలాంటి సినిమాలా తీసేది అనే విమర్శలు ఉపేంద్రనెప్పుడూ గాయపర్చలేదట. కానీ, ‘తేడా దర్శకుడు’ అనే మాట విన్నప్పుడల్లా కోపం నషాలానికి అంటుందట. కారణం.. వాస్తవ పరిస్థితుల్ని యథాతథంగా అలాంటి ట్యాగ్‌ లైన్‌ను అంటగడుతున్నారనే ఆయన ఫీలింగ్‌. ఉపేంద్ర సినిమాల్ని మెచ్చుకునేవాళ్లకంటే.. అందులోని ప్లాట్‌లైన్‌లను, కథనాల్ని తిట్టేవాళ్లు కూడా అదే రేంజ్‌లో ఉంటారు. అయినప్పటికీ ఆయనొక ‍ స్టార్‌ మేకర్‌. 

సెప్టెంబర్‌ 18న కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర (ఉపేంద్ర రావు) పుట్టినరోజు.. ఉడుప్పీ కొటేశ్వర గ్రామంలో 1968లో జన్మించారాయన. కన్ననాటే కాదు.. తెలుగులోనూ ఉప్పీకి బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.  

సినీ పరిశ్రమలో ఉపేంద్రలా ఆలోచించేవాళ్లు ఇంకెవరూ ఉండరు. ఉపేంద్ర ఒక్కడే గొప్పగా ఆలోచించగలడు : రజినీకాంత్‌

కన్నడ దర్శకుడు, నటుడు కాశీనాథ్‌.. ఉపేంద్రకి దగ్గరి బంధువు. అందుకే ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. 

కాశీనాథ్‌ స్టయిల్‌లోనే తీసిన మొదటి సినిమా ఆడకపోవడంతో.. తన స్టైల్‌లో ‘ష్‌’ తీసి మంచి దర్శకుడనే పేరు దక్కించుకున్నాడు. 

తన నిజజీవితంలో ఎదురైన.. ఎదురవుతున్న ఘటనలనే ‘పచ్చి’గా సినిమాగా చూపించడం ఉప్పీ స్టయిల్‌. 

సామాజిక స్పృహను తెరపై చూపించినప్పటికీ..  అందులోని బోల్డ్‌నెస్‌ వల్ల విమర్శలు ఎదురవుతుంటాయి

ఉపేంద్ర చిన్నతనంలో కంటి సమస్య ఎదుర్కొన్నాడు. అందుకే కొన్ని సినిమాల్లో కళ్లను అటు ఇటు తిప్పుతూ ఓ స్పెషల్‌ సిగ్నేచర్‌ను చూపిస్తుంటారు. 

‘‘నావి ఫిలసాఫికల్‌ సినిమాలేం కాదు. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నమూ చేయను. ప్రతీ మనిషి తానే గొప్ప అనే ఫీలింగ్‌ ఉంటుంది. నేను దేవుడ్ని భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు.  కానీ, ఎదుటివారి ఆలోచనల్లోని ఒడిదుడుకులు పట్టుకోవాలనుకున్నప్పుడు, మనిషి గందరగోళంగా మారతాడు. స్వార్థంతో నిండిపోయిన ఈ సొసైటీ తీరే అంతా. అలాంటి వాళ్లపైన విరక్తితోనే డైరెక్షన్‌ చేస్తున్నా  - ఓ ఇంటర్వ్యూలో ఉప్పీ చెప్పిన మాటలివి. 
 

ఉపేంద్ర డైరెక్షన్‌లో వచ్చిన ‘ఓం’.. కన్నడనాట ఓ సెన్సేషన్‌. శివరాజ్‌కుమార్‌-ప్రేమ లీడ్‌ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్‌ కల్ట్‌ క్లాసిక్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. 

హీరో కమ్‌ డైరెక్టర్‌గా ఉపేంద్ర తొలి భారీ సక్సెస్‌ ‘ఏ’. ఇది ఉప్పీ గతంలో ఓ నటితో జరిపిన ‘ప్రేమ’ వ్యవహారం ఆధారంగా తీసిన సినిమాగా ఓ ప్రచారం వినిపిస్తుంటుంది. ఈ సినిమా సక్సెస్‌తో  బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ తన ప్రొడక్షన్‌ హౌజ్‌లో ఓ సినిమా తీయాలంటూ ఉప్పీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు.
  

ఆ శాండల్‌వుడ్‌ రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ లీడ్‌ రోల్‌లో ‘ఆపరేషన్‌ అంత’ డైరెక్ట్‌ చేశాడు ఉపేంద్ర. కానీ, అది అంతగా ఆడలేదు. రాజకీయ కోణంలో వివాదాల్లో నిలిచింది.  ఆ తర్వాత వచ్చిన ‘ఉపేంద్ర’ భారీ సక్సెస్‌ అందుకుంది. 

ఉపేంద్ర సినిమా ముగింపును..  తన సినిమాను ఓపెనింగ్‌ షాట్‌గా వాడుకోవాలనే కోరికను స్టార్‌ దర్శకుడు శంకర్‌ గతంలో ఓ ఈవెంట్‌లో బయటపెట్టాడు కూడా. 

ముగ్గురు హీరోయిన్లను మనిషిలోని డబ్బు, అహం, డబ్బు-బాధ్యతలు అనే వాటితో పోలుస్తూ.. నేను అనే స్వార్థం ఉండకూడదనే ఉద్దేశంతో తీసిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌

షారూక్‌ ఖాన్‌ హిట్‌ మూవీ ‘డర్‌’ కన్నడ రీమేక్‌ ‘ప్రీత్‌సే’లో ఉప్పీ నటనకు ప్రశంసలు

ఏ, ఉపేంద్ర, ప్రీత్‌సే, కుటుంబ, రక్త కన్నీరు, గోకర్ణ, గౌరమ్మా, ఆటో శంకర్‌.. 1998-2005 మధ్య ఏడు వంద రోజుల హిట్‌ సినిమాలు. 

రక్తకన్నీరుకు బెస్ట్‌ డైలాగ్‌ రైటర్‌గా అవార్డు 

► వరుస సూపర్‌ హిట్లతో కన్నడ  సూపర్‌ స్టార్‌గా గుర్తింపు

తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ‘కన్యాదానం’తో యాక్టింగ్‌ డెబ్యూ

విభిన్నమైన కాన్సెప్ట్‌ సినిమాలు.. విలక్షణమైన నటుడిగా అలరించడం ఉప్పీకి ఉన్న ప్రత్యేకత

డిఫరెంట్‌ సినిమాలు తీసినా.. కొంతకాలం సక్సెస్‌కి దూరం

రోబో క్యారెక్టర్‌లో నటించిన తొలి నటుడు ఈయనే(హాలీవుడ్‌)

2008లో ‘బుద్ధివంత’(బుద్ధిమతుడు)తో బ్యాక్‌ టు ఫామ్‌. 

దశాబ్దం గ్యాప్‌ తర్వాత  2010లో సూపర్‌ సినిమా డైరెక్షన్‌

► రీమేక్‌లతో ఉప్పీకి అంతగా అచ్చీరాని సక్సెస్‌

► ఉప్పీ 2తో మరోసారి డైరెక్టర్‌గా బాధ్యతలు 

► తెలుగులో ఓంకారంతో దర్శకుడిగా డెబ్యూ. ఆ సినిమాకు నారేటర్‌ కూడా. ఆపై  కన్యాదానం,  రా, ఒకేమాట, నీతోనే ఉంటా, టాస్‌, సెల్యూట్‌, సన్నాఫ్‌ సత్యమూర్తిలో నటించారు. త్వరలో వరుణ్‌తేజ్‌ ‘గనీ’తో కనిపించనున్నారు. 

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు