‘టైసన్‌’ ఇలా మారిపోయాడేంటి? షాక్‌లో ఫ్యాన్స్‌!

16 May, 2021 12:29 IST|Sakshi

హ్యాపీడేస్‌.. 14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్‌. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టిన ఈ సినిమా శేఖర్‌ కమ్ములను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఎంతోమంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ చిత్రం.. వారందరికీ మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్‌ అయిన పాత్ర టైసన్‌. అదిరిపోయే డైలాగ్‌లతో, రివర్స్‌ పంచులతో టైసన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్‌.

A post shared by Rahul Dayakiran (@raahultyson)

ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా ‘టైసన్‌’ అని ఆటపట్టిస్తుంటారు. అంతెందుకు ఓ సన్నివేశంలో తనకు మంచి బాడీ లేదంటూ తను ప్రేమించిన శ్రావ్స్‌తోనే చెప్తాడు. కానీ ఇప్పుడు రాహుల్‌ గుర్తుపట్టకుండా మారిపోయాడు.  కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్‌లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్‌ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్‌ చేంజ్‌ ఓవర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Rahul Dayakiran (@raahultyson)

ఇప్పుడు కానీ శ్రావ్స్‌ నిన్ను చూస్తే ఫ్లాట్‌ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్‌ చేస్తున్నారు. ఈ రోజు కష్టపడితేనే రేపు మరింత బలంగా తయారవుతాం, నేను ఇక్కడివరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఫొటోలను షేర్‌ చేశాడు. కాగా రాహుల్‌ ఆ మధ్య వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది అతడి కెరీర్‌కు ఏమాత్రం ప్లస్‌ కాలేదు. కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత 100 క్రోర్స్‌ అనే మరో కొత్త చిత్రంలో నటించనున్నాడు.

చదవండి: నేను తాగింది మందు కాదు: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు