సెప్టెంబర్‌లో హ‌ర్భ‌జ‌న్‌ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ ‘ఫ్రెండ్‌షిప్‌’

24 Aug, 2021 16:38 IST|Sakshi

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా న‌టించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్‌’. జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుద‌ల చేస్తున్నారు.

చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..!

ఈ సంద‌ర్భంగా...  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎఎన్ బాలాజీ మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఎంతో గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు.  అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ చిత్రం. ఇటీవల థియేట‌ర్లో విడులైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.  అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ‘ఫ్రెండ్ షిప్‌’ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా త‌ప్ప‌కుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పారు.

చదవండి: అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్‌?

కాగా మలయాళంలో అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తో చేసి సూప‌ర్ హిట్ అయిన ‘క్వీన్’ సిరీస్‌కు రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్‌షిప్‌’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో హ‌ర్భ‌జ‌న్‌, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఈ మూవీలో మొత్తం ఐదు ఫైట్స్‌, నాలుగు పాట‌లు ఉన్నాయట. రాజ‌కీయాల‌కు, కాలేజ్ స్టూడెంట్స్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే విషయాన్ని ఆస‌క్తిక‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఎంగేజింగ్‌గా ద‌ర్శ‌కుడు జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య‌ ఫ్రెండ్‌షిప్‌ను తెర‌కెక్కించారు. ఈ మూవీ ఐదు భాష‌ల్లో(తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం) విడుద‌ల‌వుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్‌. ఇక త్వ‌ర‌లోనే రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించింది.

మరిన్ని వార్తలు