పాటకు... ఫైట్‌కూ రెడీ

3 Jul, 2021 01:50 IST|Sakshi

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, హీరో అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్‌ షిప్‌’. ‘సింగ్‌ అండ్‌ కింగ్‌’ అనేది ఉపశీర్షిక. జాన్‌ పాల్‌ రాజ్‌–శ్యామ్‌ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్, మాజీ మిస్‌ శ్రీలంక లోస్లియా హీరోయిన్‌గా నటì స్తున్నారు. ఆర్‌.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్‌. బాలాజీ నిర్మిస్తున్నారు. నేడు (జూలై 3) హర్భజన్‌ సింగ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని షూటింగ్‌ విశేషాలను చిత్రబృందం తెలియజేసింది.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. తమిళ నిర్మాత జె.సతీష్‌ కుమార్‌ (జెఎస్‌కె) విలన్‌గా నటిస్తున్నారు. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామి మంత్రాలయంలో విడుదల చేసిన లోగోకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలోని ఒక పాట, ఫైట్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. సో.. హర్భజన్‌ పాటకు,  ఫైట్‌కూ రెడీ అవుతున్నారన్న మాట. ఈ చిత్రానికి సంగీతం: డి.ఎం. ఉదయ్‌ కుమార్, కెమెరా: శాంతకుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు